About Me

My photo
నా గురించి ఏమి చెప్పాలబ్బా?

Saturday, October 15, 2011

గుర్తు లేవా? గుర్తు రావా?


నిన్ను చూడాలని ఉంది, "ఇక్కడికి ఎప్పుడు వస్తావు" అని అమ్మ అంటే
అబ్బా, మా వీసా గొడవలు నీకు అర్ధం కావమ్మ అని విసుగు
కానీ
ఒక్క రోజు ఆలస్యంగా వస్తే ఆరాటం గా ఎదురు చుసిన అమ్మ గుర్తు రాదెందుకో

జీతాలు ఇప్పుడిక్కడ కూడా బాగా ఇస్తున్నారంట అని నాన్న అంటే
అయ్యో, అక్కడి లైఫ్ స్టైల్ చాలా కష్టం నాన్న అని సమర్ధింపు
కానీ
అయిదు వేల జీతం తో ఇంటిల్ల పాది కి ఏ లోటు రానీయని నాన్న గుర్తు రారెందుకో

"నేను బ్రతికుండగా" చూస్తానో లేదో అని నాన్నమ్మ అంటే
నీకేంటే నా కూతురు పెళ్లి కూడా చూస్తావు లే అని వ్యంగ్యపు మాటలు
కానీ
ఆమె పిట్ట కథలు విననిదే నిద్రించని చిన్న నాటి రోజులు గుర్తు రావెందుకో

లేని ఓపిక తెచ్చుకుని అస్పష్టంగా "ఎలా ఉన్నావు" అని తాతయ్య అంటే
అర్ధం కావట్లేదు, గట్టిగా మాట్లాడు అని గర్దింపు
కానీ
పురాణాలని వర్ణించి చెప్పిన ఆ గంభీర స్వరం గుర్తు రాదెందుకో

ఈ వయసులో అమ్మ నాన్న కి "నీ అవసరం" అని అక్క అంటే
నాలుగు రాళ్ళు సంపాదించుకోవడం నీకిష్టం లేదా అని ప్రశ్న
కానీ
నా చదువు కోసం పై చదువులు మరిచిన ఆమె త్యాగం గుర్తు రాదెందుకో

Thursday, October 13, 2011

ఇలా ఎంత కాలం....అలా అంత దూరం!!!!!!


చినుకులా చిలిపిగా నవ్వి
ముల్లులా బుగ్గను గిల్లి
గాలిలా పెదవులు తాకి
వెన్నలై నడుమును తడిమి
వానలా తనువును తడిపి
ఎండలా గుండెలో మండి
మల్లెలా మనసున అల్లి
దీపమై కళ్ళలో వెలిగి
గూడులా ఎదలో వెలిసి
వలపులా ఆశెలు రేపి
ఇలా ఎంత కాలం....అలా అంత దూరం......

భావాలు.......





నేను మొదటి మాట పలికినప్పుడు మా అమ్మ చూపుల్లో అనురాగం
చిటికిన వేలు పట్టుకుని నను నిటారుగా నడిపిస్తున్న మా నాన్నలో గర్వం
తొలిసారి ఎవరి సాయం లేకుండా సైకల్ నడిపినప్పుడు నాలో కలిగిన ఆనందం
ఆకతాయి కుర్రాళ్ల అల్లర్లు చూసి నా గుండెలో తన్నుకొచ్చిన భయం
నువ్వే నా ప్రాణం అని నువ్వన్నప్పుడు అది కలా నిజమో అని అనుమానం
కన్యాదానం చేస్తున్న నాన్న కళ్ళలో కన్నీళ్ళా ఆనంద భాష్పాలో తెలియని అయోమయం
నీతో కలిసి ఏడు అడుగులేస్తున్నప్పుడు నా మనసులో తెలియని బిడియం
నా చేతి వంట తిని ఆటపట్టిస్తుంటే నాలో ఉబికి వచ్చిన ఉక్రోశం
 ప్రతి అడుగున నా వెనువెంట ఉండి నను ప్రోత్సహిస్తున్న నిన్ను చూసి నాలో పొంగిన అభిమానం
నా నిస్తేజానికీ నిరుత్సాహానికి కారణమేంటో చెప్పలేనంది నా మౌనం

Sunday, September 25, 2011

ప్రియతమా......నా హృదయమా!!!!!!







నీ వాలు కన్నులతో నను మరిపించి,
నీ చిలిపి నవ్వుతో నను మురిపించి,
కనుమరుగయ్యావా ప్రియతమా!

పగలు రేయి కలవని పూట,
కడలి అలలు కలసిన చోట,
నీ రాక కోసం వేచి ఉన్నా!

నీ మోము నీలి తామరం, స్వర్గసౌందర్యం,
నీ పలుకు వేణునాదం, సత్యసంగీతం.
నీ పిలుపు కోసం పరితపిస్తున్నా!

నీ ప్రేమ ని దాచుకున్న నా హృదయం దేవాలయం,
నీ రూపు గాంచిన నా కంటి లావణ్యం కమనీయం,
నా శ్వాసలో శ్వాసై నా దరి చేరవా!

కదిలెనా ఉత్తరాన వెలసిన ధృవనక్షత్రం,
కరిగెనా నిలువెత్తుగ నిలిచిన హిమాలయం,
ఈ జన్మకైనా మరు జన్మనైనా, నిను నే మరువగలనా?

Friday, September 23, 2011

ఎంతనో.......


మనిషి కి ఇరవై, మాట కి అరవై, మనసుకి వయసెంతనో, 
పలుకు కి బంగారం, వలపు కి సింగారం, ఊసులకి విలువెంతనో,
సూర్యునికి సాయంత్రం, జాబిలీ కి మధ్యాహ్నం, ఊహకి అడ్డున్దునో ,
చిరునవ్వుకి విషాధం, ప్రేమకి మరణం, ఆశ కి అంత్యమున్దునో,
గ్రీష్మం వసంతం,హేమంతం శిశిరం, స్నేహానికి ఎల్లలున్దునో.

Wednesday, September 21, 2011

My movie in Idlebrain.......wrote this long long ago:-)

http://idlebrain.com/community/mymovie/magadheera-anitha.html


After watching the movie Magadheera, I couldn't resist myself writing about the Movie.
Magadheera, incredible movie which adapted the new emerging technologies to the maximum. I could say that this movie is bundle of high technical values, performances and efforts.
Though there are many movies with the re-birth concept, this is definitely a fantastic movie and dominated all the others.I used to believe that movies should carry some message for our society.
But after watching Magadheera, I felt that movies can also be watched just for entertainment, Imagination, relaxing and they can take us to a different world, where we wish we could be in that.
I follow the saying "A picture tells thousand words", but from this one, i thought "A picture shows thousand things" . Music, Cinematography, choreography, Action, art, Costumes, Visual Effects and what not, everything is good. We can see the talent, hard work, efforts, and passion of entire crew.
When I saw people talking about this movie in TV shows/audio functions/Previews, I definitely thought that they are creating hype as this came from one of the members of MEGA FAMILY. But this proved me wrong. I could see people in the theatre sticking to the chairs with pin drop silence in the second half. A clean and sensuous romantic love story. This is the first movie, I watched twice in theaters in the recent years.
I never liked violence in movies, but when I thought about my favorite scenes in this movie, the scene came to my mind is "Fight with 100 people" episode (I can't imagine this). Almost felt that a real warrior is fighting in the war. We could visualize the great work, perfection in every inch of the frame (partilcularly in the second half).Even though there are few scenes that does not make any sense practically, they got shadowed out or dominated by the good ones.
Coming to the artist’s performance, Charan acted in both the characters with ease. Particularly in the second half, he is simply superb. He is perfect for this role, royal, strong, terrific, handsome (Greekku veerudu :-).Amazing performance in both dance and fights as well. For a while Iam made to believe that "He is born talented" :-)
Kajal is awesome, elegant, gorgeous in the princess role. Kudos to Rama mouli for her great work in Styling.
Rajamouli, a perfect director who proved that one create wonders even with the weak script :-)
Lastly, I would like to congratulate each and every one in the Magadheera crew for giving us a marvelous movie.
Watch this movie, Iam sure that you will come out with feeling that your 15/20$ are not ravaged.


Regards
~Anitha Vamshidhar~


ప్రకృతి.......





తెలవారి జామున ముంగిట వీస్తున్న పిల్లగాలి, నా కురులు సవరించు నీ చేతి స్పర్శ లా ఉంటుంది......
వర్షించి అలసిన మేఘం రవికాంతుని  కౌగిలిలో కర్పూరంలా కరిగిపోతున్నట్టు కనిపిస్తుంది..
వసంతాన సన్నగా కూస్తున్న కోకిల గానం...నీ పిలుపులాగానే పరిమళిస్తోంది... 
అల్లంత దూరాన కనిపిస్తున్న గగనం భువనం, నా నుదుటన నీ అధరాలు చుంబించినట్టుంది..
తెరలు తెరలు గా పడుతున్న మంచువాన , మల్లె దారులు కడుతున్నట్టు మనోహర దృశ్య కావ్యం అవుతుంది..
చిగురు టెండ కి  పచ్చని గడ్డి పై హిమబిందువులు ముత్యాల వాన కురిసినట్టు మురిపిస్తూ ఉంటుంది...