బుడి బుడి నడకలతో బోసి నవ్వులు చిందుస్తున్న చిన్నారి మోము లో ఉంది అందం
అప్పుడే పరుగులు నేర్చిన లేడి పిల్ల ఉత్చాహం లో ఉంది అందం
చిరు జల్లులకి తడిసిన మట్టి వాసన లో ఉంది అందం
చిటపట చినుకుల సవ్వడి లో ఉంది అందం
సన్నగా కూని రాగం లా వినిపిస్తున్న గాలి ధ్వని లో ఉంది అందం
మంచు తుఫాను తాకిడి కి తెల్ల చీర పరిచినట్టుగా ఉన్న నేల లో ఉంది అందం
హేమంత రుతువులో చిగురుటాకు పై వెలసిన ముత్యపు బిందువు లో ఉంది అందం
మండు టెండ లో అలసి సొలసిన మనసుకి చెట్టు నీడ కలిగించిన ఆనందం లో ఉంది అందం
పున్నమి వెన్నలలో విరగకాసిన జాజిమల్లె లో ఉంది అందం
సంధ్యసమయాన చెట్ల మధ్య దోబూచులాడుతున్న ఎర్రని సూర్యుని లో ఉంది అందం
మెలికలు తిరుగుతూ వాగులై వంకలై సాగుతున్న నీటి ప్రవాహం లో ఉంది అందం
కళ్యాణ తిలకం దిద్దుకుని పెళ్లి పీటలపై ఉన్న నవ వధువు సిగ్గు లో ఉంది అందం
మాగమాసం రాక కోసం ఎదురుచూస్తున్నా కన్నెపిల్ల కళ్ళలో ఉంది అందం
చిటికెన వేలు పట్టి ఏడడుగులు నడుస్తున్న నూతన వధూవరుల బెరుకు లో ఉంది అందం
తెలవారి జమున కల్లాపి జల్లి ముగ్గులేస్తున్న పడతి చేతలో ఉంది అందం
జోలాలి అంటూ నిద్రబుచ్చుతున్న అమ్మ జోలపాట లో ఉంది అందం
ప్రకృతి అందం, పదజాలం అందం,చూసే కళ్ళు అందమే,మంచి మనసు అందమే,జగమంతా అందమే!!!!!
No comments:
Post a Comment