వేలదూరమున్న తన వాళ్ళని తలవగానే ఉక్కిరిబిక్కిరి చేసే ఆలోచనల వేగాన్ని నిలువరించగలన,
నూత్నయవ్వనమున్న కుర్ర వయసులో వేడి ని థర్మామీటర్ తట్టుకో గలిగెన,
చెలికాడు పిలుపు విన్న ప్రేయసి లయబద్దమైన గుండె చప్పుడు స్టెతస్కోప్ కి అందేన,
ఆత్మీయిలని కోల్పోయిన హృదయ భారాన్ని త్రాసు భరించెన,
మనసున గూడుకట్టుకున్న ఆశల నిచ్చెన ని కొలవడానికి కొలబద్ద చాలున,
వెచ్చని గాలి నా గుప్పెట్లో బంధించగలన,
నను గన్న నా అమ్మ రూపాన్ని మరవగలన,
నాన్న ఇచ్చిన వ్యక్తిత్వాన్ని వదలగలన,
తోబుట్టువులు పంచిన అనురాగానికి వెలకట్ట గలన,
నా ఎదలో నువ్వు నాటిన మల్లె పరిమళాన్ని తెలుపగలన,
నా జీవిత కాలాన ఈ ప్రశ్నలకు బదులు దొరికెన :-)
No comments:
Post a Comment