నీరిక్షణ ఇంత హాయిగా, అందం గా ఉంటుందా?
జాబిలి కోసం ఎదురు చూస్తున్న ఆకాశం లా
వెన్నెల కోసం ఎదురు చూస్తున్న జాజి మల్లె లా
చిరుజల్లు కోసం ఎదురుచూస్తున్నా పచ్చని చెట్లు లా
సూర్యున్ని అందుకోవాలి అని పట్టుదలతో ఎగురుతున్న ఫొఎనిక్ష్ పక్షి లా
సంధ్య సమయాన తన వాళ్ళు ఇంకా గూటికి చేరలేదని ఆత్రుత గా ఎదురుచూస్తున్న అమ్మ మనసు లా
ప్రియుని ఊహ తలపులతో ఉగిసలాడుతూ ప్రేయసి పడుతున్న తీయని వ్యధ లా
నీ ఊసులతో ఉగిసలాడుతున్న మనసుని అదుపుచేయలేక
నీ కోసం ఎదురుచూస్తూ కనురెప్ప మూయడం మరిచిన కళ్ళని చూడలేక
ఊపిరి సైతం మరిచిన నన్ను నేను కట్టడి చెయ్యలేక
ప్రియతమా కరుణించవా, ఒక్కసారి నీ దరి చేర్చుకుని, నీ కౌగిలి లో బంధించవా ప్రియ:-)
No comments:
Post a Comment