నీ రాకకోసం యమునా తీరాన అలసట మరిచి ఎదురుచూసే రాధమ్మ మనసు నాకివ్వు రాధా కృష్ణా!
నీ వేణు నాదానికి పులకించి మైమరిచిన యాదవుల అదృష్టాన్ని నాకివ్వు వంశీ కృష్ణా!
నీ తలపుల వలపుల వలలో చిక్కి నడయాడిన గోపికల నాట్యాన్ని నాకివ్వు గోపి కృష్ణా!
నీ భక్తి సామరస్యం న మమల్ని ముంచెత్తిన మీరమ్మ పాటలో మాధుర్యాన్ని నాకివ్వు మురళి కృష్ణా!
నీ అధరము నుంచి వెలువడిన గీతోపదేశం విన్న అర్జునుని భాగ్యాన్నినాకివ్వు మోహన కృష్ణా!
No comments:
Post a Comment