రాయిని రూపం గా మలిచిన శిల్పి ని అడిగేనా శిల నీది ఏ కులమని!
తన రాక కోసం వేచి ఉన్న కోకిల ని అడిగేనా వసంతం నీది ఏ కులమని!తను కనపడనిదే విరియని పువ్వుని అడిగేనా సూర్యుడు నీది ఏ కులమని!
తన పిలుపు విని పురి విప్పి ఆడిన నెమలిని అడిగేనా మేఘం నీది ఏ కులమని!
తను తాకందే మొలవని గడ్డిపోచుని అడిగేనా వర్షం నీది ఏ కులమని!
జాబిలి వెన్నలదే కులం?
వీచే చిరుగాలిదే కులం?
పుడమి ఆకశానిదే కులం?
కడలి అగ్నిదే కులం?
పంచభుతాలకి లేని భేదం, మనవమాత్యులకెందుకు ఈ వ్యత్యాసం?
నీది ఏ కులం?నాది ఏ కులం?
No comments:
Post a Comment