About Me

My photo
నా గురించి ఏమి చెప్పాలబ్బా?

Tuesday, September 20, 2011

మౌనంగానే ఉన్నా!!







అలుపెరగక జీవన నౌకని ఒడ్డుకు  చేర్చాలని  నిత్య పోరాటం చేస్తున్న మా నాన్నని చూసి మౌనంగానే ఉన్నా....
కష్టాల కడలిలో ప్రళయాల అలని ఎదురీదుతున్న మా అమ్మని చూసి మౌనంగానే ఉన్నా ...
పురిటిలో బిడ్డని పోగొట్టుకున్న నా స్నేహితురాలి కన్నీటి గాధ విని మౌనంగానే ఉన్నా..
నవమోసాలు మోసి కని పెంచిన కన్న  తల్లి మరణం విని గుండె పగిలేలా  రోదిస్తున్న నా ఆత్మీయులని చూసి మౌనంగానే ఉన్నా...
కుళ్ళు కుతంత్రాలతో మానవతని మరిచిన సమాజాన్ని చూసి మౌనంగానే ఉన్నా...
లాలించి పాలించే వాళ్ళకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న  అనాధలను చూసి మౌనంగానే ఉన్నా....
నాలోని సంఘర్షణ నన్ను నిప్పులా కాలుస్తుంటే మౌనంగానే ఉన్నా...
నాలోని వ్యధ కన్నీటి వరదలయ్యి నన్ను తడిపి ముద్ద చేస్తున్నా  మౌనంగానే ఉన్నా...
స్పందించలేని నా హృదయం పాషాణంగా మారకముందే........
వేదనాగ్నిజ్వాలలు లావాలా పొంగకముందే.....................
నిరాశనిస్పృహ సెగలు ఆవహించక ముందే.........
కోపతాపాలు నన్ను నిలువునా ధహించకముందే..........
నా మౌనాన్ని నేను చేధించలేనా?

1 comment: